calender_icon.png 10 July, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొట్టరావడానికి కారణం ఇదే

06-07-2025 12:00:00 AM

ఎన్ని వ్యాయామాలు చేసినా.. నడివయసుకు వచ్చేటప్పటికి చాలామందికి పొట్ట వచ్చేస్తుంది. అందం సంగతి పక్కన పెడితే.. అది మధుమేహాన్నీ, బీపీనీ వెంటబెట్టుకొస్తుంది. అప్పటిదాకా ఉన్న కండరాలు కరిగి.. అవి ఒట్టి కొవ్వుగా మారడం ఇందుకు కారణం. ‘వైట్ అడిపోజ్ టిష్యూ’ (వాట్) అనే కణజాలం నుంచే ఆ కొవ్వులొస్తున్నాయని ఇదివరకే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. తాజాగా ఆ కణజాలాన్ని అలా ప్రేరేపించే విలన్‌ని కూడా వెతికి పట్టుకున్నారు.

అదో మూలకణమట (అడల్డ్ స్టెమ్‌సెల్). ఏసీపీ అన్నది దాని పేరు. అపరిమితంగా కొవ్వు సృష్టించేలా ‘వాట్’ను ఇది ప్రేరేపించి.. తద్వారా అనేక వ్యాధులకి కారణమవుతుందట. అమెరికాలో 50 ఏళ్లు దాటిన వందలాది రోగులపైన పరిశోధన చేసి ఈ విషయాన్ని తేల్చారు శాస్త్రవేత్తలు. సమస్యకి మూలహేతువేదో తేలింది కాబట్టి.. దానికి అడ్డుకట్ట వేసే ఔషధాలు కనిపెట్టే పనిలో ఉన్నారు పరిశోధకులు.