12 April, 2026 | 2:03 AM

స్వరాల సమయమిది

12-04-2026 12:00 AM

నిఖిల్ సిద్ధార్థ హీరో గా నటిస్తున్న తాజా భారీ చారిత్రక యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం లో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. సంయుక్త, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార వీడియోలు, చిత్రాలు ఈ ప్రాజెక్టుపై అంచనాలను భారీగా పెంచేశాయి. ని ర్మాతలు త్వరలోనే రిలీజ్ డేట్‌ను అ నౌన్స్ చేయబోతుండగా, మరోవైపు చిత్ర బృందం మ్యూజికల్ ప్ర మోషన్స్‌కు సిద్ధమవుతోంది.

ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’ ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది టీమ్. ఈ పోస్టర్‌లో నిఖిల్ యోధుడి అవతారంలో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్‌కుమార్; సంగీతం: రవి బస్రూర్; డైలాగ్స్: విజయ్ కామిశెట్టి; యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా; ప్రొడక్షన్ డిజైన్: ఎం ప్రభాహరన్, రవీంద్ర; ఎడిటర్: తమ్మిరాజు.