గడువులోగా ఫారాలు అందజేయాలి: తహసీల్దార్ శ్రీకాంత్
25-07-2026 08:41 PM
జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): 'సర్' కార్యక్రమంలో భాగంగా గడువులోపు ఎన్యూమరేషన్ పారాలను ఓటర్లు బీఎల్ఓలకు అందజేయాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ కోరారు. శనివారం మండలంలోని అడివెంల గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాలు, ఈసీఐలో పొందుపరిచే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్ఓలు ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు.






