19-12-2025 01:44:19 AM
బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. చాలా చోట్ల త్రిముఖ పోటీ కనిపించిందని, అయినప్పటికి బీజేపీకి ప్రజలు స్ప ష్టంగా మద్దతుగా నిలిచారని తెలిపారు. గురువారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ నియోజక వర్గంలో 128 గ్రామ పంచాయతీలకు గాను బీజేపీకి చెందిన 80 మంది సర్పంచ్‌లు ప్రజలు గెలిపించారని తెలిపారు. అదే విధంగా ముధోల్‌లో 178 గ్రామాలకు 98 మంది బీజేపీకి చెందిన వారు విజయం సాధించారని తెలిపారు. ఖానాపూర్ నియోజక వర్గంలోని 36 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారని తెలిపారు.