4 May, 2026 | 7:44 AM

మత్స్యకారులను పట్టించుకోండి!

01-06-2024 12:05 AM

వర్షాకాలం సమీపిస్తున్నా రాష్ట్రంలో ఇంకా చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాకపోవడం విచారకరం. వానలు రావడానికి ముందే చేప పిల్లల కోసం టెండర్లు పిలవాల్సిన ప్రభు త్వం ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని వార్తలు వచ్చాయి. ‘చేప పిల్లలు ఎక్కడ?’ అంటూ ‘విజయక్రాంతి’లో వచ్చి న వార్త మత్స్యకారుల ఆందోళనను తెలుపుతున్నది. మే నెల ముగిసినా టెండర్ల ప్రక్రియ పూర్తి కానందున ఈ పథకాన్ని కాంగ్రె స్ సర్కారు కొనసాగించదా అన్న అనుమానాలు వస్తున్నాయి. అటువంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి ఇప్పటికైనా కార్యక్రమాన్ని మొద లు పెట్టాలని కోరుతున్నాం.



 హెచ్.రాజేశం, జనగామ