18 April, 2026 | 1:54 PM

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

29-04-2025 12:43 AM

మంథని, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపి మడత రమేష్ తెలిపారు. కమాన్ పూర్  పోలీస్ స్టేషన్‌లో సోమవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామ శివారులోని రాజేందర్ నగర వద్ద ముగ్గురు వ్యక్తులు రెండు కిలోల గంజాయి తరలింపుకు సిద్ధంగా ఉన్న వారిని పక్క సమాచారం మేరకు కమాన్ పూర్ ఎస్‌ఐ కొట్టే ప్రసాద్ దాడి చేసి పట్టుకున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని చింతూరు మండల కేంద్రం చెందిన సవలం మల్లేష్ జగిత్యాల జిల్లా గుడిసెలపేట చెందిన అలక సందీప్,

మద్దెల హరీష్ లు ద్విచక్ర వాహనంపై రెండు కిలోల గంజాయిని ఓపెన్ ప్లాట్స్ వద్ద తరలించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పక్క సమాచారంతో  ఎస్‌ఐ కొట్టే ప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి ముగ్గురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు కిలోల గంజాయి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి తెలిపారు.  ఈ విలేకరుల సమావేశంలో గోదావరిఖని టూ టౌన్ సిఐ నక్క ప్రసాద్ రావు, కమాన్ పూర్ ఎస్సు కొట్టే ప్రసాద్,  ఏఎస్సు బాలాజీ నాయక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.