13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

పోక్సో కేసులో ముగ్గురి అరెస్ట్

09-11-2024 12:07 AM

నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు

కామారెడ్డి, నవంబర్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో నమోదైన పోక్సో కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు.. శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఓ మాజీ ప్రజాప్రతినిధి ఉన్నారు. ముగ్గురు నిందితులను శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

మండలం పరిధిలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించగా.. అనంతరం స్కూల్ టీచర్లు, మాజీ సర్పంచ్ రాజీచేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు గ్రామానికి న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు రాగా.. బాధిత కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని వారికి వివరించారు.

వారు విచారణ చేపట్టి అనంతరం నిందితులపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసు విచారణను కామారెడ్డి డీఎస్పీకి బదులుగా ఎల్లారెడ్డి డీఎస్పీతో చేయించారు. కామారెడి డీఎస్పీ నాగేశ్వర్‌రావు పనితీరుపై ఎస్పీ సింధుశర్మ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎల్లారెడ్డి డీఎస్పీతో విచారణ చేయించారని చర్చ జరుగుతోంది.