13 May, 2026 | 10:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

‘బోథ్’లో ఫ్లెక్సీ రాజకీయం

09-11-2024 12:01 AM

సీఎం ఫ్లెక్సీని చింపించారని  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై  కాంగ్రెస్ నేతల ధ్వజం

ఆదిలాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. అయితే సీఎం ఫ్లెక్సీని బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దగ్గరుండి చించివేయించారని.. ఫొటోలను కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మండల కేంద్రంలో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరుపార్టీల నేతలను శాంతింపజేశారు.