31 March, 2026 | 5:56 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్

08-12-2024 08:00 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. డిసెంబర్ 4వ తేదీన రాత్రి అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బెనిఫిట్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌ లో ఆడింది. అయితే బుధవారం రాత్రి దిల్ సుఖ్ నగర్ కు చెందిన మృతురాలు రేవతి తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు కలిసి పుష్ప-2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కు వెళ్లారు.

ఆ సమయంలోనే సినిమాను చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారు.  నటుడు థియేటర్‌లోకి ప్రవేశించి అభిమానులను పలకరించారు. దీంతో అభిమానులు థియేటర్ గేటు లోపలికి దూసుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం సంధ్య ధియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను చిక్కడపల్లి ఏసీపీ వెల్లడించారు.