19 July, 2026 | 7:04 AM

వివాహ వేడుకలో పేలుడు: 18 మందికి గాయాలు

30-06-2024 05:09 PM

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో ఆదివారం జరిగిన వివాహ వేడుకలో జరిగిన పేలుడులో 18 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వేడుక కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడిన వేడుకపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హ్యాండ్ గ్రెనేడ్లు విసరడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలియజేసినట్లు ఓ వార్తా సంస్థ నివేదించింది. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి విచారణ జరుపుతున్నారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూప్ లేదా వ్యక్తి బాధ్యత వహించలేదు.