వడదెబ్బతో ముగ్గురు మృతి
జగిత్యాల/ నాగర్‌కర్నూల్/రంగారెడ్డి, (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాడ్పు లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ముగ్గురు మరణించారు. ధర్మపురి, వెల్గటూర్, ఎండపల్లికి ఇన్‌చార్జి ఎంఈవోగా పనిచేస్తున్న బత్తుల భూమయ్య శుక్రవారం వడదెబ్బకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ఆసుపత్రికి తరలిస్తుంచి వైద్యం చేయిస్తుండగా శనివారం మృతిచెందారు. ఆయన మృతదేహానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆనందరావు నివాళి ఆర్పించారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మల్లేశ్వరానికి చెందిన నాగరాజు(55) అనే ట్రాక్టర్ డ్రైవర్ వడదెబ్బ తగిలి కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఆకుల వెంకటేష్ గుప్తా కుమారుడు ఆకుల రాఘవేందర్ (39) శుక్రవారం వడదెడ్డకు గురై అపరస్మారక స్థితిలో చేరుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొడుకు మృతిని కుటుంబ సభ్యు లు జీర్ణించుకోలేక బోరున విలపించారు.




