28 March, 2026 | 9:58 AM

26 జిల్లాల్లో మండుతున్న ఎండలు

05-05-2024 01:13 AM

45 నుంచి 46 డిగ్రీలు నమోదు

హైదరాబాద్, మే 4( విజయక్రాంతి):  రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. భానుడి భగభగలకు తోడు వడగాలు కూడా అదే స్థాయిలో వీస్తుడటంతో జనం ఉక్కపోత తట్టుకోలేక జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 46 డిగ్రీలు నమోదు అవుతుండగా మరో నాలుగు రోజుల్లో 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం 22 జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. అది శనివారం నాటికి 26 జిల్లాలకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా పెద్దపల్లిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 19.9 డిగ్రీలు నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూసాపేట సర్కిల్లో శనివారం 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. రానున్న మూడు రోజులు హైదరాబాద్‌లో 41 నుంచి 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అత్యల్పంగా 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.