2 May, 2026 | 4:00 PM

కంకేర్‌లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్లకు గాయాలు

02-05-2026 03:10 PM

మందుపాతర పేలి.. ముగ్గురు జవాన్లకు గాయాలు

కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శనివారం నాడు జరిగిన మందుపాతరల తొలగింపు ఆపరేషన్ (demining operation) సందర్భంగా, నక్సలైట్లు గతంలో అమర్చిన ఒక పేలుడు పదార్థం (IED Blast) పేలిపోవడంతో, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కు చెందిన ముగ్గురు జవాన్లు(Jawans ) గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 

మార్చి 31న రాష్ట్రం సాయుధ మావోయిస్టుల నుండి విముక్తమైనట్లు ప్రకటించినప్పటి నుండి, నక్సలైట్ కార్యకలాపాలకు సంబంధించిన మొదటి పేలుడు ఘటన ఇదే. నారాయణపూర్ జిల్లాను( నారాయణపూర్ జిల్లా) ఆనుకుని ఉన్న చోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అటవీ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించిందన అధికారులు తెలిపారు. గతంలో నక్సలైట్లు అమర్చిన IEDలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే ఆపరేషన్‌ను DRG బృందం చేపట్టింది.