నేను కూడా ఓట్ చోరీ బాధితుడినే: దానం నాగేందర్
02-05-2026 04:06 PM
ఓట్ చోరీ వల్లే సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోయాను
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఓట్ చోరీ బాధితుడినే అన్నారు. ఓట్ చోరీ వల్లే సికింద్రాబాద్ ఎంపీగా(Secunderabad MP) ఓడిపోయానని చెప్పారు. ఓట్ చోరీ జరగకపోయి ఉంటే ఎంపీగా గెలిచేవాడిని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రం కొత్తగా ఎస్ఐఆర్(SIR) తీసుకొచ్చిందని వివరించిన దానం ఎస్ఐఆర్ తర్వాత ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు.






