14 April, 2026 | 2:29 AM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

14-04-2026 12:37 AM
  1. భార్య, భర్త, కూతురు స్పాట్ డెడ్.. బాలుడికి గాయాలు
  2. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తట్టేపల్లి వద్ద ప్రమాదం

తాండూరు, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి శివారులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తట్టేపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ‘టీఎస్08 నెంబర్ గల లారీ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొంది. దీంతో స్కూటీపై వెళుతున్న పావని (36) ఆమె భర్త కవిరాజ్ (40) కూతురు కీర్తన(11) అక్కడికక్కడే మృతి చెందారు.

బాలుడు కార్తీక్‌కు గాయాలయ్యాయి. కార్తీక్ తల్లి శవం వద్ద చేసిన ఆక్రందనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఘటనా స్థలానికి పెద్దముల్  ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్ చేరుకుని బాలుడిని తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించి డ్రైవర్ మహమ్మద్ షరీఫ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.