అంబేద్కర్ జయంతి సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు
ఇల్లందు టౌన్ ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఇల్లందు బార్ అసోసియేషన్ ఆవరణలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనరల్ సెక్రటరీ షేక్ మహమ్మద్ ఖాసిం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ ప్రముఖ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్తగా అంటరానితనం, కుల నిర్మూలన కోసం కృషి చేసి స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పిగా నిలిచారని తెలిపారు.
చదువుతోనే వ్యక్తి ఆలోచన, స్థాయి మారుతుందని ఆయన చూపిన మార్గంలో నడవాలని, అందరూ సమానమనే భావన రాజ్యాంగంలో ప్రతిష్టించడంలో ఆయన కృషి అపారమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోశాధికారి సపావట్ బన్సిలాల్, సీనియర్ అడ్వకేట్ చెన్నకేశవరావు, బాలకృష్ణ, స్వర్ణపాక సత్యనారాయణ పాల్గొన్నారు.




