03-12-2025 08:21:58 AM
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో( Khammam district) బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం(Sathupalli Mandal) కిష్టారంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.