03-12-2025 09:16:22 AM
బస్సు - ఐచర్ వాహనం ఢీ తప్పిన పెను ప్రమాదం...
నేరడిగొండ,(విజయక్రాంతి): జిల్లాలో ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవలి బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే, తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నేరడిగొండ మండలం బోరుగాం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదిలాబాదు నుండి హైదరాబాద్ వెళుతున్న సహారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం ఒక దానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం కలగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కానీ బస్సు, ఐచర్ వాహనం ముందరి భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు కాకపోవాడతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.