06-02-2026 10:44:04 AM
గడ్చిరోలి: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు(Gadchiroli Encounter) చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ హతమయ్యారు. మరొకరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. భమ్రగడ్ తాలుకా ఫడేలా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భమ్రగడ్ తాలుకాలో గడ్చిరోలి పోలీసులు, నక్సలైట్ల మధ్య రెండు రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల సమయంలో, సి-60 కమాండో దీపక్ చిన్న మాధవి (38 ఏళ్లు) తీవ్ర బుల్లెట్ గాయాలకు గురయ్యారు. వైద్య చికిత్స అందించినప్పటికీ, ఆ జవాను గాయాల కారణంగా మరణించినట్లు గడ్చిరోలి ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.