1 April, 2026 | 2:49 PM

Breaking News

4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంత వరకు పోరాడుదాం   •   రాజక్కపల్లిలో ఉచిత గాలికుంటు టీకాలు   •   రాజక్కపల్లిలో ఉచిత గాలికుంటు టీకాలు   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ   •   అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్‌   •   లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు   •   ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •  

పాక్ ఆర్మీ దాడులు

06-02-2026 02:17 AM
  1.   216మంది ఉగ్రవాదులు హతం
  2. మిలిటెంట్ల దాడిలో సామాన్య పౌరులు కూడా..
  3. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ‘క్లియరెన్స్ ఆపరేషన్’లో 216 మంది మిలిటెంట్లు హతమైనట్లు పాక్ ఆర్మీ గురువారం ప్రకటించింది. ఈ ఘర్షణల్లో భారీప్రాణనష్టం సంభవించింది. ఇందు లో సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో  భద్రతా బలగాలు, లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన మొత్తం 22 మంది సిబ్బంది, 36 మంది పౌరులు  మరణించారని పాక్ సైన్యం ఐఎస్పీఆర్ తెలిపింది.

ఉగ్రవాదులతో స్థానికులకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో పాక్ ఆర్మీ జనవరి 29న సైనిక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. తదనంతరం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన వరుసదాడులను భద్రతాబలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని పేర్కొంది. దాడుచేస్తున్న స్లీపర్‌సెల్స్‌ను కార్యకలాపాలను నాశనం చేసినట్లు పాక్ ఆర్మీ పేర్కొంది. దీంతో పాటు భారీగా విదేశీ ఆయుధాలు, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.