ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ నివారణ సాధ్యం
ఎల్బీనగర్, మార్చి 29 : ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ నివారణ సాధ్యమేనని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్యులు, వైదేహినగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల రాంబాబు అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని వైదేహినగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సాయిస్థలి సంయుక్త ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సౌజన్యంతో, వైదేహి నగర్ నార్త్ కాలనీలో ఆదివారం ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ స దర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల రాంబాబు మాట్లాడుతూ... ఇప్పటి వరకు వైదేహి నార్త్ కాలనీలో తొలిసారి ప్రజల కోసం కోసం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామన్నారు. వైద్యులు మాట్లాడుతూ... ముం దస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ నివారణ సాధ్యమేనని అన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధా నాలను అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రాజేందర్రెడ్డి, నాగరాజ, వేణుగోపాల్, ప్రభాకర్, చక్రధర్ రెడ్డి, ఆదిత్య రామ్ నాథ్ రెడ్డి, శ్రీనివాస్, నర్సింహ, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,రవీందర్ గౌడ్, హనుమంతరావు, వెంకటరెడ్డి, పూజారులు అరుణ్ స్వామి, కైలాసపతి పాల్గొన్నారు.




