28 June, 2026 | 2:02 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందించాలి

29-05-2025 07:04 PM

తహసీల్దార్ గంగాసాగర్..

సదాశివనగర్ (విజయక్రాంతి): రేషన్ లబ్ధిదారులకు జూన్ జూలై ఆగస్టు మూడు నెలల రేషన్  బియ్యాన్ని రేషన్ డీలర్లు లబ్ధిదారులకు అందించాలని కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం తహసీల్దార్ గంగాసాగర్(Tahsildar Gangasagar) తెలిపారు. సదాశివనగర్ మండలంలోని ఆయా గ్రామాల్లో రేషన్ బియ్యం సక్రమంగా లబ్ధిదారులకు రేషన్ డీలర్లు అందజేయాలని తహసీల్దార్ గంగాసాగర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి రావడం జరిగిందని తెలిపారు. రేషన్  కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందజేయాలని తహసీల్దార్ గంగాసాగర్ సూచించారు.