28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మర్పల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు..

29-05-2025 07:07 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలోగల మర్పల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా 50 వేల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సీసీ కెమెరాలను గురువారం నాడు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్(SI Shivakumar) ప్రారంభించారు. చిన్నపాటి గ్రామంలో సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ పేర్కొన్నారు.

మండలంలోని సీసీ కెమెరాలు లేని ప్రతి గ్రామంలో గ్రామస్తుల ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ కోసం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ శ్యామ్, గ్రామస్తులు చేనబోయిన రాములు, పరుశరాములు, దేవేందర్, బాల్రాజ్, తదితరులు పాల్గొన్నారు.