calender_icon.png 1 February, 2026 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

01-02-2026 03:11:49 AM

  1. రైలు కిందపడి బలవన్మరణం
  2. మృతుల్లో తల్లి, కొడుకు, కూతురు
  3. మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై ఘటన
  4. జీవితంపై విరక్తి చెందామంటూ సూసైడ్ నోట్

కుషాయిగూడ, జనవరి 31 (విజయక్రాం తి): ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు, కూతురు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలో శనివా రం తెల్లవారుజామున జరిగింది. బోడుప్పల్‌కు చెంది న విజయ (38)కు భర్త, కుమార్తె చేతనరెడ్డి (18), కుమారుడు విశాల్‌రెడ్డి (16) ఉన్నారు. విజయ భర్త సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. విజయ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నది. పిల్లలిద్దరూ చైతన్య కాలేజీలో చదువుతున్నారు.

చేతన ఇంటర్ ద్వితీయ సంవత్సరం, విశాల్ ఇంట ర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. అయితే ఏమయిందో ఏమోగానీ శనివారం తెల్లవారుజామున కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కారును నిలిపి, నడుచుకుంటూ వెళ్లి చర్లపల్లి మధ్య ట్రాక్‌పై రైలు కిందపడి బలవన్మర ణానికి పాల్పడ్డారు. పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్న ముగ్గురిని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, అల్లు డు సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడని, పిల్లలు కూడా బాగా చదువుతున్నారని మృతురాలి తల్లి తెలిపింది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు. అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద మృతులు వదిలిన కారులో రైల్వే పోలీసులకు సూసైడ్ లభించింది. అందులో బతకాలని లేదని, జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉన్నది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.