31-01-2026 05:16:49 PM
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆరు నెలల బాలుడు
మర్రిగూడ(నాంపల్లి),(విజయక్రాంతి): నాంపల్లి మండలం కేతపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ళ నగేష్ భార్య మమత (25) అనే మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన వంపు సుజాత కుందేళ్ళ నగేష్ తో కొన్నాళ్లుగా అక్రమ సంబంధం ఉంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని నగేష్ భార్య మమతపై శనివారం మధ్యాహ్నం సమయంలో పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. అదే సమయంలో మమత సంకలో ఉన్న 6 నెలల బాబుకు కూడా నిప్పంటుకుంది తీవ్ర గాయాలవడంతో బాబును చికిత్స నిమిత్తం నలగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హఠాత్పరిణామాలతో జరిగిన సంఘటనలు భాగంగా వీధిలోకి పరిగెత్తుకొచ్చిన మమత అక్కడికడే మృతి చెందింది . నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూదిరాజు ఎస్సై లింగారెడ్డి హుటా హుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు.