21 April, 2026 | 2:31 AM

కుక్కల బారిన మూడేళ్ల చిన్నారి

21-04-2026 01:27 AM
  1. పొలాల్లోకి ఈడ్చుకెళ్లిన శునకాలు
  2. తీవ్ర గాయాలకు గురై మృతి చెందిన దివ్య బెహరా
  3. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఘటన

సుల్తానాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో మూడేళ్ల చిన్నారిని వీధి కుక్కలు పీక్కుతిని చంపేసిన సంఘటన పలువురి హృదయాలను కలిసి వేసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పరిధిలో మూడేళ్ల చిన్నారి దివ్య బెహరా ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నది. ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఆ చిన్నారిని నోట కరచుకొని పొలాల్లోకి లాక్కెళ్లాయి.

పలుచోట్ల కుక్కలు కరవడంతో దివ్య బెహరా తీవ్ర గాయాలకు గురై అక్కడిక్కడే మృతి చెందింది. తమ బిడ్డ కనబడకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలో వెతుకుతుండగా దివ్య బెహర మృతదేహాం కనపడడంతో వారు ఒక్కసారిగా హతాశయులయ్యారు. బతుకుదెరువు కోసం ఒరిస్సా నుంచి వచ్చి ఇటుక బట్టీలో పని చేస్తున్న ఆ చిన్నారి తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక రెండవ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు.