22 August, 2026 | 9:16 AM

రూ. 10 వేల ఆశతో గంజాయి రవాణా

22-08-2026 08:17 AM

బోధన్ ఆగస్టు 22 (విజయక్రాంతి): రూ.10 వేల కోసం ఆశపడి గంజాయి రవాణాకు పాల్పడిన ఇద్దరు ఒడిశా యువకులు నిజామాబాద్ లో పట్టుబడ్డారు. నిందితులు ఒడిశా గంజాం జిల్లాకు చెందిన గణేష్ పోలి (20), దీపక్ సాహు (21)ల కథనం ప్రకారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తి రూ.10 వేలు ఇచ్చి, షిర్డీలో ఆగి ఉన్న ఆటోలో 2 సూట్ కేసులు పెట్టి రావాలన్నారు. ఆ ప్రకారం సాయిశిరిడీ ఎక్స్ ప్రెస్ రైలులో వెళ్తుండగా నిజామాబాద్ లో తనిఖీల్లో సూట్ కేసుల్లో24.3 కిలోల ఎండు గంజాయి దొరికింది.