17 April, 2026 | 11:24 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

21-05-2025 09:59 AM

- డీసీఎం వాహనాన్ని ఢీకొన్న కారు 

- హయత్ నగర్ - కుంట్లూర్ రోడ్డులో ఘటన

- కుంట్లూర్ గ్రామంలో విషాదం 

ఎల్బీనగర్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్(Hayathnagar Police Station) పరిధిలోని కుంట్లూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్ నగర్ సీఐ నాగరాజుగౌడ్  తెలిపిన వివరాలు.. కుంట్లూర్ గ్రామంలోని నారాయణ కాలేజీ (బాసర క్యాంపస్) సమీపంలో.. పసుమాముల గ్రామం వైపు నుంచి కుంట్లూరు వైపు స్కోడా కారు వస్తున్నది.. అదే సమయంలో కుంట్లూరు నుంచి పసుమాముల వైపు డీసీఎం వ్యాన్ వస్తుండగా మూల మలుపు వద్ద అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుంట్లూర్ గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు చంద్రసేనారెడ్డి(24), చుంచు జంగారెడ్డి కుమారుడు త్రినాథ్ రెడ్డి(24), చుంచు శ్రీనివాన్రెడ్డి కుమారుడు వర్షిత్ రెడ్డి(23) అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఇరుక్కున్న వారి మృతదేహాలను స్థానికులు గడ్డపారల సహాయంతో బయటకు తీశారు.  అలిమేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కల్యాణ్ రెడ్డి తీవ్రంగా గాయపడగా.. స్థానికంగా ఉన్న ప్రైవేటు దవాఖానకు తరలించారు. 

ఫంక్షన్ కు వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం

కుంట్లూరు గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మంగళవారం రాత్రి పెద్ద అంబర్ పేటలో ఓ ఫంక్షన్ కు వెళ్లారు. రాత్రి నాంపల్లి లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు. స్వగ్రామం కుంట్లూరు(Kuntloor) వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 2 నిమిషాలైతే ఎవరి ఇండ్లకు వారు చేరేవారని, అంతలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని స్థానికుల వాపోయారు.