21-05-2025 10:34:11 AM
విలేకరులతో మంత్రి శ్రీధర్ బాబు మాటా ముచ్చట
పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని రామగిరి ఖిల్లాను అరకులోయ తరహాలో తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) అన్నారు. మంగళవారం పెద్దపల్లి ఎమ్మెల్యే ఇంట్లో విలేకరులతో కాసేపు ఇష్ట గోష్టి గా మంత్రి మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ... జిల్లా అభివృద్ధికి కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
రాబోయే గోదారి పుష్కరాలకు 1000 కోట్ల నిధులు ఇవ్వండి
బండి సంజయ్ కోరిన మంత్రి శ్రీధర్ బాబు
కేంద్ర మంత్రి బండి సంజయ్ రాబోయే గోదావరి పుష్కరాలకు 1000కుట్ల నిధులు కేంద్రంతో మాట్లాడి ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సరస్వతీ పుష్కరాలకు ఏమైనా నిధులు ఇచ్చారో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. ఉన్నదాంట్లో మేమే సర్దుకొని కుంభమేళా తరహాలో చేస్తున్నని, అయినా నిందలు వేస్తూనే ఉన్నారని,అవన్నీ పట్టించుకునే సమయం మాకు లేదని, పెద్దపల్లి జిల్లాను మోడల్ సిటీగా త్వరలోనే ప్రజలు చూస్తారన్నారు. పెద్దపల్లి నుంచి మంథని వయ కాటారా వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డుకు ప్రయత్నం చేస్తున్నామని, బసంత్ నగర్ లో విమానాశ్రయం కోసం కూడా కేంద్రంతో మాట్లాడుతున్న అన్నారు. త్వరలోనే జిల్లాలో ఐటి ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు లు ఉన్నారు.