calender_icon.png 21 May, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

21-05-2025 01:23:51 AM

ఏఐటీయూసీ నేత దుబాస్ రాములు ఆరోపణ 

బాన్సువాడ మే 20 (విజయ క్రాంతి): బాన్సువాడ మండలంలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ  సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు మాట్లాడుతూ కార్మిక వర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సమూలంగా రద్దుచేసి పెట్టుబడిదారులకు, కార్పోరేట్లకు, బడా వ్యాపారస్తులకు అనుకూలంగా4. లేబర్ కోడ్ లు తెచ్చింది అని ఆయన తెలిపారు. దీనివలన కార్మికులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటారని ఆయన తెలిపారు.

తక్షణమే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దును సవరణను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో తోటపల్లి శ్రీనివాస్, కొత్త సాయిలు, భూమయ్య, గంపల సాయిలు, పుట్టి సాయిలు, హనుమాన్లు, ధర్మం చిన్న సాయిలు తదితరులు పాల్గొన్నారు.