30-11-2024 01:20:00 PM
రైతుపై దాడి ఆస్పత్రికి తరలింపు
కుమ్రం భీం ఆసిఫాబాద్,( విజయ క్రాంతి): రక్తం మరిగిన పులి అడవి ప్రాంతం లోని చేన్లలో విహరిస్తుంది. పత్తి ఎరేందుకు వెళ్లిన వారిపై దాడికి పాల్పడుతుంది. పులి దాడిలో మహిళ మృతి జరిగిన సంఘటన మర్చిపోకముందే శనివారం సిర్పూర్ దుబ్బగూడ అడవి ప్రాంతంలోని చేనులో పత్తి చేరుతున్న రౌతు సురేష్ పై పులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే సురేష్ ను సిర్పూర్ టి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగర్ కు తరలించారు. వరుస ఘటనలతో జిల్లా లోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులి ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తుందో అన్న భయం లో ప్రజానీకం ఉన్నారు.