calender_icon.png 19 July, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీమంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

18-07-2025 10:24:36 PM

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు

హుజూర్ నగర్: బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను హుజూర్ నగర్ మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని కనకదుర్గ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద అమరవీరుల స్తూపం సెంటర్ లో కేక్ కట్ చేసి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు.

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో స్వరాష్ట్ర  సాధనే లక్ష్యంగా ఉద్యమమే ఊపిరిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమ నిర్మాణంలో పనిచేశారన్నారు. 4వేల మెగా వాట్స్ సామర్థ్యం గల యాదాద్రి పవర్ ప్లాంటు పరిపాలన కేంద్రీకరణలో భాగంగా యాదాద్రిభువనగిరి,సూర్యాపేట నూతన జిల్లాల ఏర్పాటు మూడు జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం కొత్త జిల్లాల్లో నూతన కలెక్టరేట్లు,ఎస్పీ కార్యాలయాలు, గురుకుల పాఠశాలలు,కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను పట్టిపీడిస్తున్న  ఫ్లోరిన్ భూతాన్ని తరిమి వేయడానికి ఇంటింటికి కృష్ణా జలాలను అందించారని, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుక వచ్చి తుంగతుర్తి సూర్యపేట కోదాడ నియోజక వర్గాలకు సాగునీరు అందించిన ఘనత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికే దక్కిందన్నారు.