calender_icon.png 21 January, 2026 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.52.42 లక్షలు

21-01-2026 06:27:21 PM

పాపన్నపేట,(విజయక్రాంతి): దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయ హుండీలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీమతి ఏ సులోచన సమక్షంలో బుధవారం గోకుల్ షెడ్ లో లెక్కించారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కించారు. గడిచిన 61 రోజుల హుండీని లెక్కించగా రూ.52,42,905 ఆదాయం సమకూరింది. బంగారం, వెండి ఆభరణాలను తిరిగి హుండీలోనే వేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.