21-02-2026 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజేశ్వర్ తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సిఎస్, డీవోలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డిఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈవో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలకు గాను 45 చీఫ్ సూపర్డెంట్లు, 45 డిపార్ట్మెంట్ ఆఫీసర్ లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
45 పరీక్ష కేంద్రాల్లో 8,154 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, ఉదయము 9:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12: 30 వరకు పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. ప్రశ్నా పత్రాల రవాణా, సీలింగ్, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సెంటర్ల సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ విదించబడుతుందని , జిరాక్స్ సెంటర్లు మూసి వేయబడతాయని చెప్పారు.
మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్ష నిర్వహించబడతాయని పరీక్షల మధ్యలో విరామం ఉన్నందున టైం టేబుల్ పై విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని విద్యార్థులు పరీక్షలకు గైహాజరు కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, డీ ఎస్ వో అప్పారావు. జిల్లా పరీక్షల బోర్డు సెక్రటరీ బాలాజీ, అన్ని మండల విద్యాశాఖ అధికారులు, సి ఎస్ ,డి ఓ లు కార్యాలయ సిబ్బంది, సీనియర్ అసిస్టెంట్లు ఎస్బి శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.