19 August, 2026 | 3:11 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు

21-09-2025 11:18 PM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజలు శాంతియుత వాతావరణంలో దసరా, దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు. ఉత్సవాలకు పగడ్బందీ భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి దుర్గా దేవి మండప నిర్వాహకులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల నిర్వాకుల పూర్తి బాధ్యత వారిదేనని అన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. శోభయాత్ర, నిమజ్జనం ఏర్పాట్లు పోలీసులు సూచించిన సమయాన్ని పాటించాలన్నారు.