21-09-2025 11:14:32 PM
ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ నాచారం ఉప్పల్ రామంతపూర్ ప్రాంతాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా బతుకమ్మ పండుగ వైభవంగా మొదలుపెట్టారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మహిళలు సంబరాలను ప్రారంభించారు. తంగేడు గుణగు బంతి వంటి పూలను జాగ్రత్తగా పేర్చి అందమైన బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మ పాటలు పడుతూ, నృత్యాలు చేశారు. ఈ పండుగ ఆడపడుచులకు ఆనందాన్ని ఉత్సాహాన్ని పంచిపెట్టింది. నవరాత్రుల చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.