21-09-2025 11:23:35 PM
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తూ జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇటీవల ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ ని తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఆదివారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వలన ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని మనోధైర్యంతో సమస్యలను ఎదుర్కొని పోరాటం చేయాలని తెలిపారు.
అధికారులు ఇప్పుటికైనా స్పందించి త్వరగా పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని మీ అందరికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు శివశంకర్, సూర్యాపేట జిల్లా జేఏసీ అధ్యక్షులు చీకూరి అశోక్ కుమార్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి జహీర్, జిల్లా జేఏసీ ఉపాధ్యక్షులు కల్లేపల్లి దశరథ జిల్లా జేఏసీ జాయింట్ సెక్రెటరీ బొజ్జ నిరన్ కుమార్, జిల్లా మీడియా కన్వీనర్ పోలేపాక నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.