టీమిండియానే నెం.1
ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్
దుబాయి, మే 11 : అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇ ప్పటికే టీ20 ఫార్మాట్‌లో నెంబర్ వన్‌గా ఉన్న టీమిండియా వన్డే ఫార్మాట్‌లోనూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ తాజా గా విడుదల చేసిన వన్డే వార్షిక ర్యాంకింగ్స్ లో భారత్ 118 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. గత ఏడాది ఛాంపియన్స్ ట్రో ఫీ విజయంతో పాటు వరుసగా వన్డే సిరీస్‌లు గెలవడంతో భారత్‌కు ఎదురే లేకుండా పోయింది.
ఈ జాబితాలో 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలోనూ, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థా నంలోనూ ఉన్నాయి. సౌతాఫ్రికా జట్టు 102 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్ 98 పాయింట్లతో ఐదో ప్లేస్‌లో ఉండగా.. శ్రీలంక(96), ఆప్ఘనిస్థాన్(93), ఇంగ్లాండ్ (89), బంగ్లాదేశ్(84), వెస్టిండీస్ (74) పాయింట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అనూహ్యంగా ఐర్లాండ్ జింబాబ్వేను వెనక్కి నెట్టి 54 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. అమెరికా 46 పా యింట్లతో 13వ స్థానంలోనూ, స్కాట్లాండ్ (44) 14వ స్థానంలోనూ నిలిచాయి.






