10 March, 2026 | 2:52 AM

విద్యుదాఘాతంతో టిప్పర్ దగ్ధం

10-03-2026 12:06 AM

చండూరు, మార్చి 9 : విద్యుత్ ఘాతంతో టిప్పర్ దగ్ధం అయిన ఘటన చండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బంగారి గడ్డ నుండి నాంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టిప్పర్లు మట్టి తరలిస్తున్నాయి. అందులో భాగంగా సోమవారం గ్రామ శివారులో మట్టి అన్లోడ్ చేస్తూ డ్రైవర్ ట్రాలీ కిందకు దింపకుండానే పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్ను గమనించకుండా టిప్పర్ను ముందుకు తీసుకురావడంతో కరెంట్ షాక్ తగిలి మంటలు అంటుకుని టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది.

కరెంట్ షాక్తో అప్పటికే గాయపడిన డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ కాళ్లు, కడుపు భాగంలో తీవ్రంగా గాయాలు కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.  సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి , దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.