30-09-2025 01:00:54 AM
తిరుమల, సెస్టెంబర్ 29: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవా రం రాత్రి శ్రీనివాసుడు తిరుమాడ వీధు ల్లో గజ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే సాయంత్రం శ్రీవారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలు, భజన బృందాల కోలాహలం, మంగళవాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి బంగా రు రథాన్ని లాగారు.భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.కాగా స్వర్ణ రథోత్స వాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూ దేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వ శుభాలు కలుగుతాయని భ క్తుల విశ్వా సం. ఉదయం శ్రీవారు కోదండ రాముని అవతారంలో హనుమంతుని వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.