calender_icon.png 30 September, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్

30-09-2025 01:29:33 AM

వ్యక్తిపై కేసు నమోదు

లక్నో, సెప్టెంబర్ 29: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి కటకటాలపాలయ్యాడు. బసేరా గ్రామానికి చెందిన హసన్‌కు కొన్నేళ్ల క్రితం అస్మాతో వివాహమైంది. భర్త వరకట్నం కోసం కొద్దిరోజులుగా బంధువులతో కలిసి భార్యను వేధిస్తున్నాడు. తాళలేని భార్య గత్యంతరం లేక  పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో తాజాగా భర్త వాట్సాప్ ద్వారా భార్యకు కాల్ చేసి, ట్రిపుల్ తలాక్ చెప్పాడు.

బాధితురాలు దీంతో భర్త హసన్, అత్త రషీదాతో మరో ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు  గాలిస్తున్నారు. ఇటీవల గోరఖ్ పూర్‌కు చెందిన ఒక మహిళ తన భర్త ఫోన్ ద్వారా ‘ట్రిపుల్ తలాక్’ చెప్పగానే ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.