22-02-2026 02:28:03 AM
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడతున్నారని మండిపాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్(టీజేఎస్‌ఎఫ్) నాయకులు శనివారం ముట్టడించారు. అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు కొమ్ము కా స్తుందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని టీజేఎస్‌ఎఫ్ విద్యార్థి నాయ కులు మండిపడ్డారు.
అనుమతి లేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోర్డు ముట్టడిని అడ్డుకున్న పోలీసులు టీజేఎస్‌ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో టీజేఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్, ఉపాధ్యక్షుడు నవీన్ గౌడ్, నాయకులు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.