ఆర్జీకర్ పోరాటాన్ని అణచివేసిన టీఎంసీ
- ఫలితాల తరువాత ఫైళ్లు బయటపెడతాం
- టీఎంసీ గూండాలకు రాష్ట్రంలో చోటు దొరకదు
- పశ్చిమ బెంగాల్ రెండోవిడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ
కోల్‌కతా, ఏప్రిల్ 24: న్యాయంకోసం ఆర్జీకర్ హత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు చేసిన పోరాటాన్ని టీఎంసీ అణచి వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం ఓ తల్లి నుంచి కూతురిని దూరం చేసిందని దుయ్యబట్టారు. ఆర్జీకర్ కేసు విషయంలో ప్రభుత్వం పూర్తి అమానవీయంగా ప్రవర్తించిందని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ దమ్‌దమ్ పానిహట్‌లో శుక్రవారం జరిగిన రెండోవిడత ఎన్నికల ప్రచా రసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జీకర్ బాధితురాలి తల్లి రత్నా దేబ్‌నాథ్‌ను పానిహతి స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టామని పెద్దఎత్తున ఆమెకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. బెంగాల్‌లో మహిళలకు గౌరవం, భద్రత, సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని ఇక గద్దెదించాలని రాష్ట్రంలోని మహిళలు నిర్ణయించుకున్నారని ప్రధాని చెప్పారు.
మహిళలను రక్షిం చడంలో టీఎంసీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తొలిదశలో జరిగిన పోలింగ్ ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు. ఈ భారీ పోలిం గ్ చూసి టీఎంసీలో ఆందోళన మొదలైందన్నారు. రెండోదశ పోలింగ్‌లో కూడా విజ యపతాకం ఎగురవేయాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సం బంధించిన ఫైళ్లు ఎన్నికల ఫలితాల తరువా త బయట పెడతామని హెచ్చరించారు.
బెం గాల్ విప్లవాల గడ్డ అని మర్చిపోవద్దని బీజే పీ కార్యకర్తలకు చెప్పారు. మే 4న ఫలితాలు వచ్చాక టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి రాష్ట్రంలో చోటు దొరకదన్నారు. మమ త ప్రభుత్వం సాగిస్తున్న జంగిల్ రాజ్‌కు ఎం డ్‌కార్డ్ పడే సమయం ఆసన్నమైందని, ఇది మోదీ గ్యారెంటీ అని ప్రధాని పేర్కొన్నారు. కాగా ఉదయం ప్రధాని మోదీ కోల్‌కతాలోని హుగ్లీనదిలో విహరించారు. కెమెరా లో సుందరదృశ్యాలను బంధించారు. పడవ నడిపే వ్యక్తి గౌరంగ్ బిస్వాస్‌తో ముచ్చటించి అతనికి రూ. 500 ఇచ్చారు. అతన్ని హత్తుకొని ధన్యవాదాలు తెలిపారు.






