యుద్ధంలో అణ్వాయుధాలు వాడబోం
- ఇరాన్‌కు సమయం మించిపోతోంది
- ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ మరో మూడు వారాలు పొడిగింపు: ట్రంప్
- నరకకూపం వ్యాఖ్యలపై అమెరికా యూటర్న్
వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధాలు ఉపయోగించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయి తే తమతో ఒప్పందానికి రావాలని.. సమ యం మించిపోతోందని ఆ దేశాన్ని హెచ్చరించారు. ఇజ్రాయెల్, లెబనాన్‌పై కొనసా గుతున్న కాల్పుల విరమణ మరో మూడు వారాలు పొడిగించారు. ఇంకో పక్క తను చేసిన నరకకూపం వ్యాఖ్యలపై ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు.
భారత్ ఎంతో గొప్ప దేశమని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నట్లు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం పేర్కొంది. వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌తో యుద్ధంలో అణ్వాయుధాలు వాడే ప్రణాళిక తనకు లేదని చెప్పారు. తాను ఎందుకు అణ్వాయుధాన్ని ఉపయోగిస్తాను? అది లేకుండానే సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లో తాము వారిని ఇప్పటికే సర్వనాశనం చేశాం. తాను దాన్ని ఉపయోగించను.
అణ్వాయుధాన్ని ఉపయోగించడానికి ఎవరినీ, ఎప్పటికీ అనుమతించకూడదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెహ్రాన్‌తో ఒప్పందానికి తాను తొందరపడటం లేదని స్పష్టం చేశారు. తక్షణ పరిష్కారం కంటే స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందం పైనే దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల ముగిసిన రెండు వారాల కాల్పుల విరమణలో ఇరాన్ తన ఆయుధ వ్యవస్థలను పునరుద్ధరించుకొని ఉండవచ్చని చెప్పారు.
అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్‌కు సమయం మించిపోతోందని హెచ్చరిస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘నాకు చాలా సమయం ఉంది. కానీ ఇరాన్‌కు లేదు. సమయం మించిపోతోంది. ఇరాన్ సైన్యం కుప్పకూలిపోయింది. వారి నాయకులు ఇక మనతో లేరు. దిగ్బంధనం పటిష్టంగా ఉంది. ఇకనుంచి పరిస్థితి మరిం త దారుణంగా ఉంటుంది’ అని ఆయన పోస్టు చేశారు.
ఇటీవల ఇరాన్ జెండా ఉన్న ఉన్న ఓ వాణిజ్య నౌకను అమెరికా సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తున్న బహుమతి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఆ బహుమతి ఏంటనే విషయాన్ని వెల్లడించేందుకు ఆయ న నిరాకరించారు. అది అత్యంత రహస్యమైనదని పేర్కొన్నారు. ఇరాన్ నౌకలపై విధించి న దిగ్బంధనాన్ని అద్భుతమని కొనియాడారు. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకో వడం, హోర్ముజ్ జలసంధిలో సీ మైన్స్ పెట్టి ఇరాన్ పెద్ద తప్పు చేసిందన్నారు.
మరోపక్క ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణను మరో మూడు వారా లు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇరుదేశాల నాయకులు త్వరలో వైట్ హౌస్‌లో సమావేశమయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇంకో పక్క భారత్‌ను నరక కూపంతో పోల్చి, వివాదంలో చిక్కుకున్న ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. భారత్ ఎంతో గొప్ప దేశమని, తన మిత్రుడు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.
అయితే భా రత్ గొప్ప దేశమంటూ ట్రంప్ ఎక్కడ, ఎప్పు డు అన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. భారత్, చైనా నరకకూపాలు అని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ మీడియా నుంచి ప్రశ్నలు రావడం తో రాయబార కార్యాలయం వివరణ ఇచ్చుకుంది. ఈ వివాదంపై భారత్ విదేశాంగ శా ఖ కూడా స్పందించింది. ఆ కథనాలను చూశామని, వాటిని అక్కడితో వదిలేస్తున్నామని భారత విదేశాంగశాఖ అధికార ప్రతి నిధి రణధీర్ జయస్‌వాల్ పేర్కొన్నారు.






