20-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కళానిలయం సాంస్కృతిక, సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి నాట్య బాల సాంస్కృతిక కార్యక్రమం తెలంగాణ సరస్వత పరిషత్, అబిడ్స్, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 8 సంవత్సరాల చిన్నారి నర్తకి కె నిత్యశ్రీ ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ నృత్య ప్రదర్శన డాన్స్ మాస్టర్ ధశరత్ మార్గదర్శకత్వంలో జరిగింది. ఆయన శిక్షణ, కృషికి ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. గత 25 సంవత్సరాలుగా కళాసాంస్కృతిక సేవలు అందిస్తున్న కళానిలయం సంస్థ, యువ కళాకారులకు వేదిక కల్పిస్తూ భారతీయ సంప్ర దాయ కళలను పరిరక్షిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు కళా ప్రముఖులు, సాం స్కృతిక అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరై కార్యక్రమాన్ని అభినందించారు.