కలెక్టర్ ను కలిసిన టీఎన్జీవో ఉద్యోగులు
07-10-2025 08:33 PM
నిర్మల్ (విజయక్రాంతి): కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్(TNGOs) సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సభ్యులందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సమన్వయంతో, నిబద్ధతతో పని చేసి ప్రజా సేవలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TNGOs జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి కూడా రవికుమార్ నాయకులు గడ్డం శ్రీనివాస్ మోహన్ రెడ్డి, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




