07-10-2025 08:36:08 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ జె(టోనీ) ప్రధాన అతిథిగా హాజరై, కార్యకర్తలకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రవీణ్ జె మాట్లాడుతూ, పార్టీ బలోపేతం ప్రతి కార్యకర్త బాధ్యత అని, గ్రామ స్థాయి నుంచి ప్రజల మద్దతు సంపాదించే దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యమని, ఐక్యతతో ముందుకు సాగితే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.