calender_icon.png 7 October, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలన

07-10-2025 08:31:22 PM

జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్..

గద్వాల (విజయక్రాంతి): గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని గంజిపేట వార్డు నం.14లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనుల్లో నాణ్యతపై ఏమాత్రం రాజీ పడకుండా, ప్రతి దశలో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, మట్టిని లబ్ధిదారులకు అందజేయాలని అన్నారు. మున్సిపల్ స్థాయిలో మార్క్ అవుట్, బేస్‌మెంట్ స్థాయి పనులు వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.

నిర్మాణపు పనులు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. అధికారులు పూర్తయిన పనుల ఫోటోలను వెంటనే క్యాప్చర్ చేయాలని, లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ, వారు తమ ఇందిరమ్మ ఇండ్లను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జానకి రామ్, సిబ్బంది, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.