calender_icon.png 20 February, 2026 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల రూపురేఖలు మార్చేందుకు..కొత్త సర్పంచులు ముందుకు రావాలి

20-02-2026 01:40:27 AM

  1. గ్రామాల మార్పు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి 

స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ల అయినా గ్రామాల సమస్యలు తీరలే

ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడికైనా వెళ్తా

ఒక్కో గ్రామపంచాయతీకి రెండు లక్షల విలువ గల  ఫర్నిచర్ అందజేత

గ్రామ మార్పు కోసం మీరు కూడా నాతో నడుము కట్టండి

సంవత్సరంలో ఒక నెల గ్రామాభివృద్ధికి కేటాయించండి

ప్రముఖ వ్యాపార వేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి

కామారెడ్డి/బీబిపేట , ఫిబ్రవరి 19, (విజయక్రాంతి): గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కొత్త సర్పంచులు నడుం బిగించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం జనగామ లో కామారెడ్డి నియోజకవర్గం లోని 50 గ్రామపంచాయతీలకు ఫర్నిచర్ ను పంపిణీ చేశారు. పార్టీలకతీతంగా సహకరించాలని గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు.

యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని కొత్తగా వచ్చిన సర్పంచులు ఎక్కువగా యువతనే ఉందన్నారు. తన సాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలిపారు. ఇప్పటికే రామారెడ్డి మండలం రెడ్డి పేట పాఠశాల నిర్మాణం పనులు పూర్తికావత్తున్నాయని,  మాచారెడ్డి మండలం పర్దిపేట్లో పాఠశాల భవనం పనులు పూర్తి కా వస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం అందినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని తెలిపారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యంపైనే డబ్బులు పెట్టి నష్టపోతున్నారన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక  దృక్పథంతో పలు గ్రామపంచాయతీ కార్యాలయాలకు ఫర్నిచర్ అందజేయాలన్న దృక్పథంతో ప్రముఖ వ్యాపార వేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి విశిష్ట  కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నట్లు తెలిపారు.  గ్రామీణ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో, తన సొంత ఖర్చుతో ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు రూ. 2.లక్షల విలువైన ఆధునిక ఆఫీస్ ఫర్నిచర్ను అందించేం దుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 

గ్రామ సర్పంచ్లు, కార్యదర్శులు, సిబ్బంది కార్యాలయాల్లో సౌకర్యవంతంగా పనిచేయడానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలు వంటి సామగ్రిని ఆయా గ్రామాల సర్పంచులు పాలకవర్గాలకు అందజేశారు . ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సంవత్సరంలో కేవలం ఒక నెల రోజులు కేటాయించి అభివృద్ధికై పాటుపడండి అని పిలుపునిచ్చారు.

ప్రభుత్వాలను నిద్రలేపే విధంగా పని చేద్దామని ఎవరూ చేయని సాహసాన్ని మనం చేసిన రోజే విజయం మన దరికి వస్తుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గురువారం మొదటి విడతగా  50  గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతిని ధులు, గ్రామ నాయకులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  గ్రామీణాభివృద్ధి పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటుకుంటూ, ప్రజాసేవే పరమావదిగా  భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేప ట్టిన సుభాష్ రెడ్డి ని స్థానిక ప్రజలు, నాయకులు అభినందించారు.

భవిష్యత్తులో  అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు  వెల్లడించారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి కొరకై  ప్రజా పిలుపు మేరకు రాజకీయ అరంగేట్రం కూడా సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  తన అన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా అంత్యక్రియల కు  హాజరైన తన మిత్రులు, వ్యాపార భాగస్వాములు గ్రామాన్ని చూసి ఇది ఏమి గ్రామం అంటూ దెప్పి పొడచడం వల్ల గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి సంకల్పం పెట్టుకొని ఇప్పటికే కార్పొరేట్ స్థాయి గ్రామపంచాయతీ భవనం, గ్రామంలో అన్ని రోడ్లు సిసి రోడ్లు,

గ్రంథాలయం, వంటి అన్ని సౌకర్యాలను కల్పించినట్లు అంతేకాకుండా తాను చదువుకున్న పాఠశాల కూడా కార్పొరేట్ స్థాయిలో నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారి పక్కన రాష్ట్రంలోనే ఆదర్శంగా 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు.   ప్రముఖ గాయకులు మిట్టపల్లి సురేందర్, కాచాపూర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కిష్టా గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకట్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.