calender_icon.png 20 February, 2026 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

20-02-2026 01:41:58 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో నిర్మిస్తున్న  మరుగుదొడ్ల స్థితిగతులు, అంగన్వాడీ భవనాలు ,మరుగుదొడ్ల నిర్మాణం/పరిరక్షణ, గ్రామపంచాయతీ భవనాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ కోరారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద వరద పనులు, ఈజీఎస్ పనుల తీరు పై గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అదనపు కలెక్టర్  తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరు పై జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించి, ఆయా శాఖల మండల అధికారుల పని తీరు పై ఆరా తీసి, నిర్లక్ష్యం వహించకుండా నిర్మాణ పనుల ను వేగవంతం చేసి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా పాఠశాలలలోని మరుగుదొడ్ల ప్రస్తుత స్థితిగతులు, వాటి వినియోగం, పరిశుభ్రత  తాగునీటి సదుపాయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేలా మరుగుదొడ్లను నిర్మించి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మరమ్మతులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల ఏర్పాటు పై,   నిర్మాణంలో ఉన్న భవనాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, ఇప్పటికే పూర్తయిన భవనాలలో మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

చిన్నారుల  ఆరోగ్యం, భద్రత దృష్ట్యా పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పురోగతిని పరిశీలిస్తూ, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక సదుపాయాలతో భవనాలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

ఆయా నిర్మాణ పనులు ఈ ఈ పి ఆర్ త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని, గ్రామాల వారిగా పురోగతి కల్పించాలని అన్నారు. అదేవిధంగా ఎన్ ఆర్ జి ఎస్ కింద చేపడుతున్న వరద నివారణ పనులు , ఈజిఎస్ పనుల అమలు తీరుపై వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యత, కార్మికులకు సమయానికి వేతనాల చెల్లింపు, పారదర్శకత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు సమర్థవంతంగా చేపట్టాలని, అవసరమైన చోట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ సమీక్ష లో డి ఆర్ డి ఓ సురేందర్, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి ప్రమీల, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా యువజన సంక్షేమ అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి, సిడిపిఓ లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.